యాషెస్ సిరీస్‌లో డేవిడ్ వార్నర్ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 క్యాచ్‌లు అందుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 4 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టిన ఆసీస్ ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
ఇప్పటివరకు 11మంది ఆసీస్ క్రికెటర్లు ఈ ఘనత సాధించారు. 2017లో గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో స్టీవ్ స్మిత్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. స్మిత్ తర్వాత మళ్లీ డేవిడ్ వార్నర్ ఈ ఘనత అందుకున్నాడు.
హెడింగ్లే వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్, జోయ్ రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ క్యాచ్‌లను అందుకున్నాడు వార్నర్. గతంలో జరిగిన టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా రెండు క్యాచ్‌లు మాత్రమే పట్టుకున్నాడు వార్నర్. ఇలా ఐదు సార్లు అందుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 67 పరుగులకే ఆలౌటైంది. కంగారూ బౌలర్లు హజిల్‌వుడ్(5), కమిన్స్(3), జేమ్స్ ప్యాటిన్సన్(2) ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆట మొదలు పెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 179 పరుగులకు ఆలౌటైంది.
ఇది చదవండి: యాషెస్: 67 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్