తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ.. మైదానం నుంచి తలెత్తుకుని రావా?

టీమిండియా సారథి​ విరాట్​ కోహ్లీకి న్యూజిలాండ్​ పర్యటన చేదు అనుభవం మిగిల్చింది. టెస్టుల్లో ప్రపంచ అత్యుత్తమ ​జట్టుకు కెప్టెన్ మాత్రమే కాకుండా పరుగుల వీరుడైన విరాట్​.. ఈ సిరీస్​లో పేలవంగా ఆడాడు. తాజాగా కివీస్​తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లోనూ 14 రన్స్​కే పెవిలియన్​ చేరాడు. కోహ్లీ తన కేరీర్​లో ఇలా ఫామ్​ కోల్పోవడం ఇది ముడో సారి. గతంలో ఈ క్రికెటర్​ ఎప్పుడెప్పుడు ఫామ్​ కోల్పోయాడు? ఎన్నెన్ని పరుగులు చేశాడు? వంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.

Head Bending: virat-kohli-runs-list-from-2011-to-2018-matches
కోహ్లీ.. మైదానం నుంచి తలెత్తే నీ అభివాదమేది?

By

Published : Mar 1, 2020, 1:03 PM IST

Updated : Mar 3, 2020, 1:28 AM IST

విరాట్​ కోహ్లీ.. పరుగులు చేయడంలో మేటి. మైదానంలో ఆడితే ఎవరూ రారు ఇతడికి పోటీ. అయితే న్యూజిలాండ్​ టెస్టు సిరీస్​లో కనీసం చేయలేకపోయాడు ఓ ట్వంటీ. ప్రస్తుతం కింగ్​ కోహ్లీ విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు. పరుగుల ప్రవాహం పారించిన బ్యాట్​.. ప్రస్తుతం తడబడుతోంది. ఆటలో అతడి పోరాటం, మైదానం నుంచి బయటకు వస్తూ అతడు చేసే అభివాదం అన్నీ కనుమరుగయ్యాయి. అందుకే అతడు తలదించుకు వస్తుంటే దేశమంతా నివ్వెరపోతోంది. నీ ఆటతో ఓసారి తలెత్తవా అని సగటు అభిమాని గుండె ప్రతిధ్వనిస్తోంది.

ఓ చేదు జ్ఞాపకమే..

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి న్యూజిలాండ్‌ పర్యటన మరో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. 45, 11, 38, 11(టీ20లు) 51, 15, 9(వన్డేలు) 2, 9.. 3, 14(టెస్టులు) ఈ పర్యటన మొత్తంలో కోహ్లీ చేసిన పరుగులివి. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు 14(30 బంతుల్లో 3 ఫోర్లు) మరోసారి నిరాశపర్చాడు.

ఔట్​ అయ్యాక నిరాశతో కోహ్లీ

కివీస్‌ పర్యటన మొత్తంలో తొలివన్డేలో అర్ధ శతకం మినహా మిగతా ఏ మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు విరాట్​. హామిల్టన్‌ వేదికగా జరిగిన వన్డేలో 51 పరుగులు చేసిన భారత సారథి.. ఆ తర్వాత ఏ పోరులోనూ కనీసం 20 పరుగులు చేయలేకపోయాడు. ఇక సుదీర్ఘ ఫార్మాట్​లో మూడంకెల స్కోరు అందుకొని దాదాపు 20 ఇన్నింగ్స్​లే ముగిశాయి.

మూడోసారి తడ'బ్యాటు​'

కోహ్లీ 2011లో తొలిసారి ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఫామ్‌ కోల్పోయి సతమతమయ్యాడు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు ఇదే తరహాలో ఇబ్బంది పడ్డాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ పర్యటనలో పూర్తిగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత 2018 ఇంగ్లాండ్‌ పర్యటనలో చెలరేగి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. కోహ్లీ కెరీర్‌లో ఫామ్‌ కోల్పోవడం ఇది మూడో సారి. ఈ నేపథ్యంలో భారత సారథి ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చూడండి : పాంచ్​ పటాకా: దుబాయ్​ ఛాంపియన్​షిప్​ విజేత జకోవిచ్

Last Updated : Mar 3, 2020, 1:28 AM IST

ABOUT THE AUTHOR

...view details