టీమ్ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య ఓ పాట పాడి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'కేసరి' సినిమాలోని 'తెరి మిట్టీ' పాటను పాడి అలరించారు. ఈ వీడియోను హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
లాక్డౌన్లో కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్న హార్దిక్, కృనాల్ పాండ్యా.. వారికి నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు. తాజాగా ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి 'తెరి మిట్టీ'ని ఆలపించడం నెటిజన్లను ఆకర్షించింది.