తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ జట్టు నుంచి హేల్స్​కు ఉద్వాసన - డ్రగ్స్ పరీక్షలో విఫలమైన హేల్స్

డ్రగ్స్ పరీక్షలో విఫలమైన కారణంగా ఇంగ్లండ్ జట్టు నుంచి అలెక్స్ హేల్స్​ను తప్పించారు. త్వరలో జరిగే ప్రపంచకప్​లో ఆడే అవకాశం కోల్పోయాడీ క్రికెటర్.

ప్రపంచకప్​ జ్టటు నుంచి అతడ్ని తప్పించారు

By

Published : Apr 29, 2019, 4:53 PM IST

ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్.. స్వదేశంలో జరిగే ప్రపంచకప్​లో ఆడే అవకాశం కోల్పోయాడు. మే 30 నుంచి ఇంగ్లండ్- వేల్స్ వేదికగా ఈ మెగాటోర్నీ జరగనుంది. ఇదే కాకుండా టెస్టు, టీట్వంటీ జట్ల నుంచి అతడికి ఉద్వాసన పలికారు. నిషేధిత డ్రగ్స్ వాడిన కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. హేల్స్ స్థానాన్ని భర్తీ చేసే క్రికెటర్ పేరు త్వరలో ప్రకటిస్తామని ఈసీబీ తెలిపింది.

త్వరలో పాకిస్థాన్​, ఐర్లాండ్​లతో జరిగే సిరీస్​లలో హేల్స్ ఆడటం లేదు. సంబంధిత విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోమవారం ధ్రువీకరించింది.

హేల్స్.. ప్రస్తుతం 21 రోజుల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. అతడి కెరీర్​లో డ్రగ్స్ పరీక్షలో విఫలమవడం ఇది రెండోసారి. పర్యవసానంగా అలెక్స్ ఏడాది జీతం నుంచి 5 శాతం జరిమానా విధించింది ఈసీబీ.

" ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాం. జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనుకుంటున్నాం. దీని కోసం చాలా కష్టపడుతున్నాం. ఇలాంటి సమయంలో క్రికెటర్లు హద్దు మీరకుండా ఉండేందుకే ఇలా చేశాం."

-అస్లే గిల్స్, ఈసీబీ మేనేజింగ్ డైరక్టర్

ABOUT THE AUTHOR

...view details