భారత్‌తో జరిగిన చివరి వన్డే తర్వాత గేల్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తానని తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతానికి అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకా జట్టుతోనే కొనసాగుతున్నట్లు తెలిపాడు. అయితే కోహ్లీ గేల్ రిటైర్మెంట్పై స్పందిస్తూ.. అతడో మంచి స్నేహభావం గల క్రికెటర్ అంటూ ప్రశంసించాడు.
"మానవత్వం ఉన్న మంచి మనిషి గేల్. యువ క్రికెటర్లకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అతడో మంచి స్నేహితుడు. వెస్టిండీస్ క్రికెట్‌కు ఎంతో కృషి చేశాడు. విండీస్ జట్టుకు ఐకాన్‌గా వెలుగొందాడు. ఒత్తిడిగా ఉన్న సమయాల్లోను నవ్వుతూ ఉండగలడు. అలాంటి వ్యక్తితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా".
-కోహ్లీ, టీమిండియా సారథి