తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో వన్డే సిరీస్​లో గేల్​కు అవకాశం

ఆగస్టు 8 నుంచి 14 వరకు భారత్​తో వన్డే సిరీస్​ ఆడనుంది విండీస్. ఈ రోజు 14 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది విండీస్ బోర్డు. ఈ సిరీస్​తో అంతర్జాతీయ కెరీర్​కు వీడ్కోలు పలకనున్న క్రిస్​ గేల్​కు అవకాశం కల్పించింది.

విండీస్ జట్టు

By

Published : Jul 26, 2019, 9:02 PM IST

ఆగస్టు 3 నుంచి టీమిండియా.. వెస్టిండీస్​లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ 20 జట్టు ప్రకటించిన విండీస్ తాజాగా వన్డే జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్​లో క్రిస్​ గేల్​కు అవకాశం కల్పించింది కరీబియన్ బోర్డు. 14 మంది సభ్యులలో ఈ విధ్వంసకర ఓపెనర్​ను తీసుకుంది.

భారత్​తో జరగనున్న ఈ వన్డే సిరీస్​తో రిటైర్ కానున్నట్టు గేల్ ఇంతకుముందే ప్రకటించాడు. వన్డేల్లో 10వేల 393 పరుగులు చేసిన క్రిస్ గేల్ మరో 13 పరుగులు చేస్తే లారా (10వేల 405) రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన విండీస్ ఆటగాడిగా లారా ఘనతకెక్కాడు.

"క్రిస్ గేల్ విలువైన, అనుభవం గల ఆటగాడు. క్రికెట్ వ్యూహాలకు సంబంధించి డ్రెస్సింగ్​ రూమ్​లో జట్టుకు అతడి అవసరముంది" - ఫ్లయడ్ రీఫర్, విండీస్ కోచ్.

వెస్టిండీస్ వన్డే జట్టు ఇదే..

జేసన్ హోల్డర్​ (కెప్టెన్), జాన్ క్యాంప్​బెల్, ఎవిన్ లూయిస్, హిట్మైర్​, నికొలస్ పూరన్, రొస్టన్ చేజ్స ఫాబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్​వైట్, కీమో పాల్, క్రిస్ గేల్, షెల్డాన్ కాట్రెల్, థామస్, షాయ్ హోప్​, కీమర్​ రోచ్​.

విండీస్ వన్డే జట్టు

గేల్​తోపాటు ఎడమ చేతివాటం ఓపెనర్​ జాన్ క్యాంప్​బెల్, రోస్టన్ చేజ్ ఆల్​రౌండర్ కీమో పాల్​ను జట్టులో తీసుకుంది. ఆగస్టు 8న గయనా నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఆగస్టు 11, 14న జరిగే రెండు మ్యాచ్​లకు ట్రినిడాడ్​లో క్వీన్స్ పార్క్​ ఓవల్ వేదిక కానుంది.

ఇది చదవండి: టీమిండియాతో తలపడే విండీస్​ టీ20 జట్టిదే

ABOUT THE AUTHOR

...view details