తనకు నచ్చినపుడు క్రికెట్‌కు వీడ్కోలు పలికే హక్కు ధోనీ సంపాదించుకున్నాడని అన్నారు టీమ్‌ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్.
"ధోనీ అద్భుతమైన క్రికెటర్. తెలివితేటలు, ప్రశాంతత, బలం, వేగం, అథ్లెటిజం కారణంగా అతడు ఇతరులకు భిన్నంగా కనిపిస్తాడు. మహీ మ్యాచ్ విన్నర్. ఈ లక్షణాల వల్లే అతడు ఈ తరం గొప్ప క్రికెటర్లలో ఒకడయ్యాడు. తనకు ఇష్టమున్నపుడు ఆటకు వీడ్కోలు పలికే హక్కును అతను సంపాదించుకున్నాడు. రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటిస్తావని అతణ్ని బలవంతం పెట్టకూడదు"