2016 టీ20 ప్రపంచకప్ స్వదేశంలో జరగడం వల్ల టీమ్ఇండియా కచ్చితంగా రెండోసారి ఈ ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలుస్తుందని అంతా భావించారు. లీగ్ స్టేజ్‌లో అదరగొట్టిన ధోనీసేన సెమీస్‌లో విండీస్‌తో అద్భుతంగా తలపడినా చివరి క్షణాల్లో బోల్తాపడింది. విరాట్ కోహ్లీ(89; 47 బంతుల్లో 11x4, 1x6) మెరుపు బ్యాటింగ్‌కు తోడు.. రోహిత్‌శర్మ (43), అజింక్య రహానె(40) శుభారంభం ఇవ్వడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రోహిత్, రహానె తొలి వికెట్‌కు 7.2 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. రోహిత్ ఔటయ్యాక.. రహానెతో జోడీకట్టిన విరాట్ రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 128 పరుగుల వద్ద రహానె పెవిలియన్ చేరాక.. కోహ్లీ, నాటి కెప్టెన్ ధోనీ(15)తో కలిసి మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
భారత్ గెలుస్తుందనుకుంటే..!
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రమాదకర క్రిస్‌గేల్(5), శామ్యూల్స్(8) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్ చేరడం వల్ల టీమ్ఇండియా విజయం ఖాయమనుకున్నారు. తర్వాత జాన్సన్ (52), లెండిల్ సిమ్మన్స్(82) నిలకడగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 116 పరుగుల వద్ద జాన్సన్ ఔటయ్యాక.. విండీస్ విజయానికి 6 ఓవర్లలో 73 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రూ రసెల్(43; 20 బంతుల్లో 3x4, 4x6) విధ్వంసకరంగా బ్యాటింగ్ చేసి విండీస్‌ను గెలిపించాడు. తర్వాత ఆ జట్టు ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ సాధించింది.