టీ20 ప్రపంచకప్-2007 జట్టులో దిగ్గజ ఆటగాళ్లు సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లకు స్థానం దక్కకపోవడం వెనకున్న కారణాన్ని తాజాగా వెల్లడించాడు మాజీ జట్టు మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్. ఈ మెగాటోర్నీలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ్ సూచించాడని.. దాని వల్ల సీనియర్ ఆటగాళ్లైన సచిన్, గంగూలీలకు అవకాశం దక్కలేదని తెలిపాడు.
"అవును అదే నిజం. 2007 టీ20 ప్రపంచకప్ తుదిజట్టులో గంగూలీ, సచిన్‌లకు అవకాశం దక్కకపోవడానికి రాహుల్ ద్రవిడే కారణం. ఆ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడానికి సరాసరి దక్షిణాఫ్రికా చేరుకుంది భారత జట్టు. ఈ టోర్నీకి యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాలని రాహుల్ ద్రవిడ్ సూచించాడు. భారత్ ఆ ట్రోఫీ గెలిచిన తర్వాత సచిన్ బాధపడ్డాడు. ఎందుకంటే తాను చాలా ఏళ్లు జట్టుకు ఆడుతున్నాని చెబుతూ.. ప్రపంచకప్‌ను ఒకసారైనా గెలవకపోయానని విచారాన్ని వ్యక్తం చేశాడు".