తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీరు మైదానంలో దిగితే రికార్డుల వరదే - వీరంతా బ్యాటింగ్​కు దిగి భారీగా దంచినోళ్లు

ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరికీ ఫేవరెట్‌ గేమ్‌ క్రికెట్​. అయితే ఈ ఆటలో బ్యాటింగ్‌కు దిగిన వెంటనే ఫటాపట్​ బాదేయాలి. లేకపోతే మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టమే అవుతుంది. మరి తక్కువ బంతుల్లోనే అర్ధశతకం, శతకం, 150 పరుగులు, ద్విశతకం, త్రిశతకం, 400 పరుగులను సాధించిన బ్యాట్స్‌మెన్‌ ఎవరో ఓ సారి లుక్కేద్దామా..!

FASTEST  FIFTY AND CENTURY AND DOUBLE TRIPLE AN DQUADRUPLE IN CRICKET
వీరంతా బ్యాటింగ్​కు దిగి భారీగా దంచినోళ్లు

By

Published : Apr 14, 2020, 11:13 AM IST

క్రికెట్‌.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడే ఆట. ఒకప్పుడు టెస్టులు.. ఆ తర్వాత వన్డేలు.. ఇప్పుడు‌ ధనాధన్‌ అంటూ టీ20లు ఏలేస్తున్నాయ్. క్లాసిక్‌ గేమ్‌గా టెస్టు ఆటకు పేరుంటే.. వన్డేల్లో అటు నిలకడగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టేవారు. అయితే టీ20‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన వెంటనే బాదేయాలి. బౌలర్లను ఊచకోత కోసేయడమే. అయితే ఇది అన్ని వేళలా కుదరదు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నప్పటికీ దూకుడుగా ఆడేయాలి. లేకపోతే మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టమే అవుతుంది. మరి అలా క్రికెట్‌ చరిత్రలో వేగవంతమైన అర్ధశతకం, శతకం, 150 పరుగులు, ద్విశతకం, త్రిశతకం, 400 పరుగులను సాధించిన బ్యాట్స్‌మెన్‌ ఎవరో చూసేయండి!

50 పరుగులు

టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఎక్కువగా నమోదయ్యే స్కోర్లు అర్ధశతకాలే. టీ20ల్లో తక్కువ బంతుల్లో వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌ మన యువరాజ్‌ సింగ్‌. 2007 టీ20 ప్రపంచకప్‌లో కేవలం 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదేశాడు. ఇక వన్డేల్లో ఏబీ డివిలియర్స్‌ కేవలం 16 బంతుల్లో అర్ధశతకం కొట్టాడు. టెస్టుల్లో పాకిస్థాన్‌కు చెందిన మిస్బావుల్‌ హక్..‌ 21 బంతుల్లో వేగంగా 50 పరుగులు చేశాడు.

యువరాజ్ సింగ్-డివిలియర్స్-మిస్బావుల్ హక్

వేగంగా సెంచరీ కొట్టిన వీరులు

భీకర బౌలింగ్‌ను ఎదుర్కొని మ్యాచ్‌లో శతకం కొట్టాడంటే మామూలు విషయం కాదు. అదే తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదేస్తే వామ్మో అనాల్సిందే. మరి టీ20ల్లో శతకాలు నమోదయ్యేది తక్కువ. టీ20ల్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదేశారు. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మిల్లర్‌, శ్రీలంక ఆటగాడు ఎస్‌ విక్రమ శేఖర వేగవంతమైన శతకం సాధించిన వారిలో ఉన్నారు. వీరు ముగ్గురూ కేవలం 35 బంతుల్లోనే 100 పరుగులు చేశారు. వన్డేల్లో అయితే ఏబీ డివిలియర్స్‌ కేవలం 31 బంతుల్లోనే శతకం చేశాడు. టెస్టుల్లో న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్ బ్రెండన్‌ మెకల్లమ్‌ (54) వేగవంతమైన‌ సెంచరీని నమోదు చేశాడు.

వీరంతా బ్యాటింగ్​కు దిగి భారీగా దంచినోళ్లు
వీరంతా బ్యాటింగ్​కు దిగి భారీగా దంచినోళ్లు

డబుల్ దంచినోళ్లు

శతకాలు కొట్టడమంటేనే గొప్ప అనుకుంటాం.. మరి డబుల్‌ సెంచరీ సాధించడమంటే మహాద్భుతమే కదా. టీ20ల్లో ఇప్పటివరకు ఒక్క ద్విశతకం నమోదు కాలేదు. అత్యధిక స్కోరు 175 (క్రిస్‌ గేల్‌). వన్డేల్లో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ డబుల్‌ సెంచరీని సాధించారు. భారత్‌కు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ ద్విశతకాలను చేశారు. అయితే మన హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (264, 209, 208*) మూడు డబుల్‌ సెంచరీలను చేయడం విశేషం. అయితే అత్యంత వేగంగా ద్విశతకం నమోదు చేసింది మాత్రం క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో) కావడం విశేషం. ఇక టెస్టుల్లో న్యూజిలాండ్‌కు చెందిన నాథన్‌ ఆస్టల్‌ కేవలం 153 బంతుల్లోనే ద్విశతకం బాదేశాడు.

వీరంతా బ్యాటింగ్​కు దిగి భారీగా దంచినోళ్లు

ట్రిపుల్‌/క్వాడ్రపుల్‌ సెంచరీ

టెస్టుల్లో అత్యంత వేగంగా త్రిశతకం నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (278 బంతులు). ప్రపంచ టెస్టు క్రికెట్‌లో క్వాడ్రపుల్‌ సెంచరీ నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ బ్రియాన్‌ లారా మాత్రమే. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో లారా.. ఈ రికార్డును నమోదు చేశాడు. భీకరమైన ఇంగ్లీష్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ పరుగులు చేయడం నిజంగా అద్భుతమే.

వీరంతా బ్యాటింగ్​కు దిగి భారీగా దంచినోళ్లు
వీరంతా బ్యాటింగ్​కు దిగి భారీగా దంచినోళ్లు

ఇదీ చూడండి : 'ఐపీఎల్​ అప్పటివరకు నిర్వహించడం సాధ్యం కాదు'

ABOUT THE AUTHOR

...view details