తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ క్రికెటర్​ ఫకర్​ జమాన్​కు చేదు అనుభవం - ENGLAND TEAM INDIA

వెస్టిండీస్​తో మ్యాచ్​లో పాక్​ ఓపెనర్​ ఫకర్​ జమాన్​కు అనుకోని అనుభవం ఎదురైంది. ఫకర్ భాయ్.. పకోడీలు తీసుకురా అంటూ స్టేడియంలోని ఓ అభిమాని వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

పాక్​ క్రికెటర్​ ఫకర్​ జమాన్​కు చేదు అనుభవం

By

Published : Jun 3, 2019, 9:30 AM IST

ప్రస్తుతం వన్టే ప్రపంచకప్​ హోరాహోరీగా సాగుతోంది. కప్పు కొట్టాలని జట్లన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆసియా దేశాల అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఇటీవల జరిగిన వెస్టిండీస్​తో​ మ్యాచ్​లో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో పాక్​ ఓపెనర్​ ఫకర్​ జమాన్​కు చేదు అనుభవం ఎదురైంది. ఆ వీడియో కాస్త వైరల్​గా మారింది.

ఫకర్ జమాన్ ఫీల్డింగ్​ చేస్తుండగా స్టేడియంలో ఉన్న ఓ అభిమాని.. అతడ్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశాడు. "ఫకర్ భాయ్.. రూ.20 పకోడీ తీసుకురా" అంటూ గేలి చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 105 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించింది వెస్టిండీస్.

ఇది చదవండి: ప్రపంచకప్​లో పాక్​ రెండో అత్యల్ప స్కోరు

ABOUT THE AUTHOR

...view details