"ఇంగ్లాండ్‌ను ఓడించడం ఐర్లాండ్ ఆటగాళ్లకు ఓ కల" అని తొలి ఇన్నింగ్స్ తరవాత ఆ దేశ బౌలర్ టిమ్ ముర్తా వెల్లడించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే రూట్ సేన ఆలౌట్ అవ్వడం వల్ల... పసికూనకు కొత్త చరిత్ర సృష్టించేందుకు అవకాశం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కుదుటపడిన ఇంగ్లాండ్ జట్టు 303 పరుగులు చేసి... ప్రత్యర్థి ముందు 182 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉంచింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన ఐర్లాండ్... కనీసం పోరాటం చేయకుండా 38 పరుగులకే చేతులెత్తేసింది.
ఇంగ్లాండ్ పేసర్ వోక్స్ 17 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. మరో సీనియర్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. ఈ ఇద్దరు బౌలర్లే మొత్తం ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ 143 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వరుణుడి వల్లే...
ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు కురిసిన వర్షం కారణంగా పరిస్థితులు ఇంగ్లాండ్ పేసర్లకు అనుకూలించాయి. బంతి విపరీతంగా స్వింగ్ అయింది.
ఐర్లాండ్ బ్యాటింగ్ లైనప్ వోక్స్, బ్రాడ్ ధాటికి కుప్పకూలింది. ఒక దశలో 24/3తో ఉన్న ఆ జట్టు.. 14 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 15.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌటైంది. టెస్టు క్రికెట్లో ఒక జట్టు చేసిన 7వ అత్యల్ప స్కోరిది. మొదటి అత్యల్ప స్కోరు న్యూజిలాండ్ (26) పేరిట ఉంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కాగా.. 11 పరుగులు చేసిన జేమ్స్ మెక్‌కలమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 85
ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్: 207
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 303
ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్: 38 (జేమ్స్ మెక్‌కలమ్ 11; వోక్స్ 6/17, బ్రాడ్ 4/19).
ఇవీ చూడండి...'లార్డ్స్ హానర్ బోర్డు'లో ఐర్లాండ్ బౌలర్‌కు చోటు