తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి టెస్టులో ఇంగ్లాండ్​కు కష్టమేనా?

మాంచెస్టర్​లో జరుగుతున్న తొలి టెస్టులో పిచ్​ ప్రమాదకరంగా మారుతున్న వేళ.. ఇంగ్లాండ్​కు గెలుపు కష్టంలా కనిపిస్తోంది. పాక్ ప్రస్తుతం 244 పరుగుల ఆధిక్యంతో ఉంది.

తొలి టెస్టులో ఇంగ్లాండ్​కు కష్టమేనా?
ఇంగ్లాండ్ పాక్ తొలి టెస్టు

By

Published : Aug 8, 2020, 6:28 AM IST

సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడటం అలవాటుగా మార్చుకున్న ఇంగ్లాండ్‌కు.. మాంచెస్టర్‌లో ఇబ్బందులు తప్పేలా లేవు. తొలి టెస్టులో 107 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన పాకిస్థాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడ్డప్పటికీ ప్రత్యర్థికి సవాలు విసిరే లక్ష్యాన్నే నిర్దేశించేలా ఉంది.

ఇంగ్లాండ్-పాకిస్థాన్ తొలి టెస్టులోని దృశ్యం

ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌ రసవత్తర ముగింపు దిశగా సాగుతోంది. వర్షం వల్ల తొలి రోజు సగం ఆటకు నష్టం వాటిల్లినప్పటికీ.. ఈ మ్యాచ్‌ ఫలితం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన పాక్‌.. శుక్రవారం ఇంగ్లాండ్‌ 219 పరుగులకే పరిమితం చేసి 107 పరుగుల ఆధిక్యం సాధించింది. స్పిన్నర్లు యాసిర్‌ షా (4/66), షాదాబ్‌ ఖాన్‌ (2/13)లతో పాటు మహ్మద్‌ అబ్బాస్‌ (2/33) ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశారు. పోప్‌ (62; 117 బంతుల్లో 84) టాప్‌స్కోరర్‌. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌.. మూడో రోజు ఆట ఆఖరుకు 137/8తో నిలిచింది. ఆ జట్టు ప్రస్తుత ఆధిక్యం 244. ఈ వేదికలో లక్ష్యం 250 దాటినా సవాలే అని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఛేదన ఇంగ్లాండ్‌కు తేలిక కాదు.

ఇంగ్లాండ్-పాకిస్థాన్ తొలి టెస్టులోని దృశ్యం

వికెట్ల జాతర:

రెండో రోజు షాన్‌ మసూద్‌ బ్యాటింగ్‌ హైలైట్‌.. మూడో రోజు మాత్రం బౌలర్లదే ఆటంతా. శనివారం మొత్తం 14 వికెట్లు పడ్డాయి. 92/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను పోప్‌, బట్లర్‌ మెరుగైన స్థితికి చేర్చే ప్రయత్నం చేశారు. కానీ.. వీళ్లిద్దరూ వెనుదిరిగాక ఆ జట్టు గాడి తప్పింది. ముందుగా జట్టు స్కోరు 127 వద్ద పోప్‌ ఐదో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. వోక్స్‌ (19)తో కలిసి కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించిన బట్లర్‌ (38).. యాసిర్‌ షా బౌలింగ్‌లో వెనుదిరిగాక పతనం ఊపందుకుంది. షా, మరో లెగ్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ కలిసి ఇంగ్లాండ్‌ లోయరార్డర్‌ పని పట్టారు. బ్రాడ్‌ (29 నాటౌట్‌) పోరాడకుంటే ఇంగ్లాండ్‌ 200 కూడా దాటేంది కాదు. వంద పైచిలుకు ఆధిక్యం కోల్పోయిన ఆతిథ్య జట్టుకు.. తర్వాత బౌలర్లు ఆశలు కల్పించారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను దెబ్బ కొట్టారు. ఆ జట్టు 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌ హీరో మసూద్‌ను డకౌట్‌ చేసిన బ్రాడ్‌ జట్టుకు శుభారంభాన్నందించాడు. తర్వాత వోక్స్‌ (2/11) పాక్‌ను గట్టి దెబ్బ తీశాడు. అజహర్‌ అలీ (18), అజామ్‌ (5)లను ఔట్‌ చేశాడు. అసద్‌ షఫీక్‌ (29), రిజ్వాన్‌ (27) వికెట్ల పతనాన్ని అడ్డుకుని స్కోరును 100 దాటించారు. వీళ్లిద్దరూ తక్కువ వ్యవధిలో ఔటవడం వల్ల పాక్‌ మళ్లీ ఇబ్బందుల్లో పడింది.

ABOUT THE AUTHOR

...view details