తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​: డెన్లీ డాషింగ్​- ఇంగ్లాండ్​ భారీ స్కోర్​ - రెండో ఇన్నింగ్స్

యాషెస్​ చివరి టెస్టు నెగ్గి సిరీస్​ను సమం చేసేందుకు అడుగులు వేస్తోంది ఇంగ్లాండ్​. మూడో రోజు ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టు ఆధిక్యం 382కు చేరింది.

ఆస్ట్రేలియా ముందు ఇంగ్లాండ్​ భారీ లక్ష్యం

By

Published : Sep 15, 2019, 8:17 AM IST

Updated : Sep 30, 2019, 4:05 PM IST

యాషెస్​ చివరి టెస్ట్​ నెగ్గేందుకు ఉవ్విళ్లూరుతోంది ఇంగ్లాండ్​ జట్టు. మూడో రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 382 పరుగులు.

డెన్లీ డాషింగ్​ ఇన్నింగ్స్​​...

మూడో రోజు రెండో ఇన్నింగ్స్​ను 9/0 వద్ద ఆటను ఆరంభించిన ఇంగ్లాండ్​... ఓపెనర్లు బర్న్స్​(20), కెప్టెన్​ రూట్​(21) తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. అయితే మరో ఓపెనర్​ జో డెన్లీ 94 పరుగులతో(266 బంతుల్లో;14 ఫోర్లు, 1సిక్సర్​) రాణించాడు. ఆసీస్​ పేసర్​ సిడిల్​ బౌలింగ్​లో చెత్త షాట్​కు ప్రయత్నించి స్మిత్​కు క్యాచ్​ ఇచ్చాడు. ఫలితంగా తృటిలో శతకం చేజార్చుకున్నాడు.

ప్రపంచకప్​ హీరో, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 67(115 బంతుల్లో; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి ఇంగ్లాండ్​కు మరోసారి కీలక భాగస్వామ్యం అందించాడు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక బట్లర్(47) ఇన్నింగ్స్​ను నడిపించాడు. ఒక దశలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 305 స్కోరుతో నిలిచింది. అయితే మూడో రోజు చివర్లో రెండు వికెట్లు వెంటవెంటనే పడ్డాయి. ఆట ఆఖరుకు ఆర్చర్ (3), లీచ్(5) క్రీజులో ఉన్నారు.

ఆసీస్ బౌలర్లలో లైయన్ 65 పరుగులిచ్చి 3 వికెట్లు, సిడిల్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించారు. మిచెల్ మార్ష్ కేవలం 4 రన్స్​కే 2 వికెట్లు తీశాడు.

ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్​ చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. ఇప్పటికే ఆసిస్​ ముందు భారీ స్కోరు ఉంచిన ఇంగ్లీష్​ జట్టు...తమ బౌలింగ్​లోనూ ప్రతిభ చూపిస్తే ఈ మ్యాచ్​ నెగ్గడం కష్టమేమి కాదు. ప్రస్తుతం సిరీస్​లో ఆస్ట్రేలియా జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details