ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సరికొత్త రికార్డు దక్కించుకున్నాడు. ఈ దశాబ్దంలో నాలుగు వందల టెస్టు వికెట్ల తీసిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో ప్రొటీస్ కెప్టెన్ డుప్లెసిస్‌ను ఔట్ చేసి 400వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
ఈ దశకంలో అత్యదిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా ఇంగ్లీష్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్(428)అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత స్థానంలో బ్రాడ్ ఉన్నాడు. ఈ జాబితాలో అండర్సన్, బ్రాడ్ తర్వాత స్థానంలో ఉన్న ముగ్గురూ స్పిన్నర్లే కావడం విశేషం. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్(376), శ్రీలంక స్పిన్నర్ రంగనా హేరత్(363), రవిచంద్రన్ అశ్విన్(362) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా అండర్సన్ 576 వికెట్లు సాధించగా.. బ్రాడ్ 474 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.