ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ఆటల్లో క్రికెట్ ఒకటి. ఇందులో కొందరు ఆటగాళ్లు బౌలింగ్‌తో.. మరికొందరు బ్యాటింగ్‌తో రాణిస్తారు. కానీ కొందరు ఆటలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. విభిన్న బ్యాటింగ్ శైలితో కనిపిస్తారు. వీరు బౌలర్లను తికమకపెడుతూ బ్యాటింగ్ చేస్తుంటారు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్, విండీస్ మాజీ క్రికెటర్ చంద్రపాల్ ఈ కోవకు చెందినవారే. అలాంటి వారిలో మరికొందరు మీకోసం.
1.శివనారాయణ్ చంద్రపాల్
వెస్టిండీస్ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ విభిన్న బ్యాటింగ్ శైలితో మైదానంలో అలరించేవాడు. ఈ విండీస్ బ్యాట్స్‌మన్ 1994లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో మొత్తం 164 టెస్టులు ఆడిన చంద్రపాల్ 51.37 సగటుతో 11,867 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధికం 203 నాటౌట్. మొత్తం 268 వన్డేలు ఆడి 41.60 సగటుతో 8,778 పరుగులు సాధించాడు.
2.జార్జ్ బెయిలీ
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ క్రికెట్‌లో విచిత్రమైన బ్యాటింగ్ పొజిషన్‌ని కనిపెట్టాడు. అతడి ఆటను చూసిన అభిమానులు తికమక చెందారు. 2016లో చివరిసారి ఆసీస్ తరఫున ఆడిన అతడు అప్పటి నుంచి దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియా, విక్టోరియా జట్ల మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో అరుదైన బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. టస్మానియా జట్టుకు చెందిన బెయిలీ 25వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. వికెట్ కీపర్ వైపు నిల్చొని కనిపించాడు. అయితే ముఖం మాత్రం సాధారణ స్థితిలో ఉంచడం గమనార్హం. బౌలర్ బంతిని విసరగానే సహజపద్ధతిలోకి మారి, ఆ బంతిని షాట్ ఆడాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.
3. గ్లెన్ ఫిలిఫ్స్
న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఆడిన ఓ షాట్ ఇదే తరహాలోనిది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫోర్డ్ ట్రోఫీలో అతడు ఆక్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో వినూత్న రీతిలో అతడు బ్యాట్‌ను వెనక్కితిప్పి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఒటాగోపై ఆక్లాండ్ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్లెన్ ఫిలిఫ్స్ (156, 135 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లు) సాధించాడు.
4.క్రెగ్ మెక్ మిలన్