తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ-20ల్లో విరాట్ - రోహిత్ రికార్డులు బద్దలవుతాయా!

దక్షిణాఫ్రికాతో ఆదివారం నుంచి మూడు మ్యాచ్​ల టీ-20 సిరీస్ జరుగనున్న నేపథ్యంలో తమ పేరిట ఉన్న కొన్ని రికార్డులు బద్దలు చేయాలనుకుంటున్నారు విరాట్, రోహిత్. ఎక్కువ పరుగులతో రోహిత్ ముందున్నాడు. శతకం కోసం ఎదురుచూస్తున్నాడు కోహ్లీ.

విరాట్ - రోహిత్

By

Published : Sep 14, 2019, 6:16 AM IST

Updated : Sep 30, 2019, 1:15 PM IST

టీమిడింయా స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్​లో వరుస రికార్డులతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా టీ-20 ఫార్మాట్​లో నువ్వా - నేనా అనేలా కొనసాగుతుంది వీరి ప్రదర్శన. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్​ల టీ-20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్​లో విరాట్ - రోహిత్ రికార్డులు ఇప్పుడు చూద్దాం!

టీ 20ల్లో అత్యధిక పరుగుల వీరులు..

అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. 88 ఇన్నింగ్స్​ల్లో 2,422 పరుగులు చేశాడు. 65 ఇన్నింగ్స్​ల్లో 2,369 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు కోహ్లీ. వీరిద్దరి మధ్య అంతరం 53 పరుగులే. సఫారీలతో జరగనున్న టీ-20ల్లో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశముంది. మార్టిన్ గప్తిల్ 2,283 పరుగులు, షోయబ్​ మాలిక్ 2,263 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

రోహిత్ శర్మ

శతకం కోసం వేట..

టీ-20ల్లో నాలుగు శతకాలు, 17 అర్ధశతకాలతో ముందు వరుసలో ఉన్నాడు రోహిత్. 21 అర్ధసెంచరీలు చేసిన కోహ్లీ మాత్రంశతకంఅందుకోలేకపోయాడు. వన్డే, టెస్టు క్రికెట్​లో వంద మైలురాయి సాధించిన విరాట్ పొట్టి ఫార్మాట్​లో సెంచరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.

విరాట్ కోహ్లీ

స్వదేశంలో ప్రొటీస్​పై ప్రతీకారం...

సొంత గడ్డపై ఒకే ఒక్క సారి దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్​తో తలపడింది టీమిండియా. 2015లో జరిగిన ఆ సిరీస్​లో ప్రొటీస్ 2-0 తేడాతో నెగ్గింది. అప్పటి పరాభవానికి ప్రతీకారం ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటోంది కోహ్లీ సేన. 2008 నుంచి ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ-20 సిరీస్​లు చూసుకుంటే 13-8 తేడాతో భారత్ ముందంజలో ఉంది.

ఫామ్​పై ఇరు ఆటగాళ్ల దృష్టి..

మయాంక్ అగర్వాల్​తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​లో చోటు దక్కించుకోని హిట్ మ్యాన్ సఫారీలపై టీ 20ల్లో సత్తాచాటి తనేంటో చూపించు కోవాలనుకుంటున్నాడు. విండీస్​పై పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమైన కోహ్లీ ఇందులో భారీ స్కోర్లు చేయాలని ఆశిస్తున్నాడు.

ఈ నెల 15 నుంచి 22 వరకు దక్షిణాఫ్రికాతో మూడు టీ-20లు ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్ ధర్మశాల వేదిక కాగా.. రెండు, మూడు మ్యాచ్​లు.. మొహాలీ, బెంగళూరుల్లో జరుగనున్నాయి.

ఇదీ చదవండి: వైరల్: ధోనీ వీడ్కోలుపై సీఎస్​కే ట్వీట్

Last Updated : Sep 30, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details