కరోనా వైరస్ భయంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అవుతుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం అందరికంటే భిన్నంగా గడుపుతున్నాడు. ఐపీఎల్ కోసం మిగిలిన ఆటగాళ్లందరికంటే ముందుగా చెన్నై చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన మహీ.. కరోనా భయంతో ప్రాక్టీస్ రద్దు కావడం వల్ల స్వస్థలం ఝార్ఖండ్‌కు వెళ్లిపోయాడు.
ఝార్ఖండ్ వీధుల్లో ధోనీ రయ్ రయ్
కరోనా కారణంగా ఐపీఎల్ వచ్చే నెలకు వాయిదా పడింది. క్రికెటర్లు స్వస్థలాలకు వెళ్లి కుటుంబంతో గడుపుతున్నారు. చెన్నై కెప్టెన్ ధోనీ మాత్రం సొంతూరులోనే బైక్ రైడ్‌కు వెళ్లాడు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఝార్ఖండ్ వీధుల్లో ధోనీ.. బైక్‌పై సవారి
అయితే అక్కడా అతడేం ఖాళీగా కూర్చోలేదు. ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాడ్మింటన్ ఆడిన ధోనీ.. ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన బైక్ రైడ్‌కు వెళ్లాడు. రాంచీ వీధుల్లో హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్న అతడ్ని గుర్తు పట్టిన అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
ఇదీ చూడండి.. భయం భయం.. క్రీడారంగంపై కరోనా ప్రభావం