అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్‌స్టా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 2004 డిసెంబరు 23న తొలి వన్డే మ్యాచ్ ఆడాడు మహీ. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేశాడు. 2005 డిసెంబరు 2న తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు - ధోనీ వీడ్కోలు
15:43 August 15
అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్
మొత్తం తన కెరీర్‌లో 350 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు ధోనీ. వన్డేల్లో 10 శతకాలు, 73 అర్ధశతకాలు సాధించాడు. వన్డేల్లో 10,773 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 183 పరుగులు.కెరీర్‌లో 90 టెస్టుల్లో పాలుపంచుకున్నాడు. ఈ ఫార్మాట్లో6 శతకాలు, 33 అర్ధశతకాలు చేశాడు. అలాగే 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఘనతలు
అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా ధోనీ రికార్డు
ధోనీ సారథ్యంలో 2007లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్
2011లో ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్
ధోనీకి 2008, 2009 ఐసీసీ వన్డే ప్లేయర్ పురస్కారాలు