తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ సంస్థపై సుప్రీంను ఆశ్రయించనున్న ధోని - dhoni

తనకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం, ఓ ఇంటి విషయంలో మోసం చేసిందనే ఆరోపణలతో ఆమ్రపాలి సంస్థపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాడు టీమిండియా మాజీ సారథి ధోని.

ధోని

By

Published : Apr 28, 2019, 11:51 AM IST

Updated : Apr 28, 2019, 12:06 PM IST

ఆమ్రపాలి సంస్థతో తలెత్తిన వివాదంలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నాడు. తనకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడం, ఓ ఇంటి విషయంలోనూ సంస్థ మోసం చేయడమే ఇందుకు కారణం.

2009-2016 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా నియమించుకుంది ఆమ్రపాలి సంస్థ. పలు వ్యాపార విషయాల్లోనూ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ధోనీకి చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ధోని ఒక పెంటౌజ్‌ను బుక్‌ చేసుకున్నాడు. ఆ ఇల్లు విషయంలోనూ అతడికి యాజమాన్య హక్కులు కల్పించలేదు. సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ధోని బాధ్యతలను అర్ధంతరంగా నిలిపివేసింది. మహీ భార్య సాక్షి కూడా ఈ సంస్థకు సంబంధించిన ఓ ఛారిటీ సంస్థతో వ్యాపార సంబంధాలు కలిగి ఉంది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. ఆ సంస్థపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఆమ్రపాలి వద్ద ఇల్లు కొనుగోలు చేసిన 46 వేల మంది సంస్థ తమను మోసం చేసిందంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన సుప్రీం కోర్టు ఆ సంస్థకు చెందిన ఉప సంస్థలు, డైరెక్టర్ల ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యలో ఆపేసిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(ఎన్‌బీసీసీ)ను సుప్రీం కోర్టు జనవరి 25న సూచించింది. ఫిబ్రవరి 28న ఆ సంస్థకు చెందిన సీఎండీ అనిల్‌ శర్మ, ఇద్దరు డైరెక్టర్లు శివ్‌ దీవాని, అజయ్‌ కుమార్‌ను పోలీస్‌ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.

Last Updated : Apr 28, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details