తెలంగాణ

telangana

'ధోనీని టాప్​ఆర్డర్​లో చూడాలనుకున్నా.. కానీ'

By

Published : Aug 24, 2020, 5:31 AM IST

అద్భుత హిట్టింగ్ ధోనీ సొంతమని చెప్పిన గంగూలీ.. తాను కెప్టెన్​గా ఉన్నప్పుడు అతడికి టాప్​ఆర్డర్​లో అవకాశం కల్పించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

Dhoni
ధోనీ

టీమ్​ఇండియా కెప్టెన్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. భారీ షాట్లు కొట్టే నైపుణ్యం ఉండటం వల్లే కెరీర్​ ప్రారంభంలో అతడిని ప్రోత్సాహించానని అన్నాడు. టాప్​ఆర్డర్​లో పంపించి, పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు పేర్కొన్నాడు. 2005లో విశాఖపట్నంలో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​ను గుర్తు చేసుకున్నాడు.

"వైజాగ్​లో పాక్​తో జరిగిన మ్యాచ్​లో ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్​ దిగాడు. అద్భుతమైన సెంచరీ చేశాడు. దీనితో పాటే ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా, భారీ స్కోరు చేసేవాడు. సచిన్​ ఆరో స్థానంలో అడుగుపెడితే.. ఎప్పటికీ సచిన్​ కాలేడు. కానీ ధోనీకి అది సాధ్యమైంది" -సౌరభ్ గంగూలీ, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

తను కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత చాలాసార్లు ధోనీ టాప్​ ఆర్డర్​లో ఆడాలని కోరుకున్నట్లు గంగూలీ చెప్పాడు. కానీ అది జరగలేదని అన్నాడు. ధోనీ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీ టీమ్​ఇండియాలోకి అరంగేట్రం చేసినప్పుడు గంగూలీనే కెప్టెన్​గా ఉన్నాడు. 2005 వైజాగ్​లో పాకిస్థాన్​తో వన్డేలో ధోనీని మూడో స్థానంలో పంపించింది గంగూలీనే. ఆరోజు మహీ 148 పరుగులు చేసి, దాదా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.

ABOUT THE AUTHOR

...view details