హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరగనున్న తొలి వన్డేకు ముందు కోహ్లీసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న భారత సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ధోనీకి గాయమైంది. నెట్ ప్రాక్టీస్‌లో జట్టు సభ్యుడు రాఘవేంద్ర వేసిన బంతి ధోని మోచేయికి తగిలింది.
తొలి వన్డేకు ధోని దూరం..?
నెట్ ప్రాక్టీస్‌లో భారత మాజీ కెప్టెన్ ధోనికి గాయమైంది. మహీ కోలుకోకుంటే తొలి వన్డేలో రిషబ్ పంత్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
చికిత్స అనంతరం ధోని కొంచెం ఇబ్బందిగానే కనిపించాడు. ఈ తరుణంలో మ్యాచ్ ఆడే అవకాశం సంక్షిష్టంగా మారింది. ఒకవేళ మహీ ఆసీస్‌తో తొలి వన్డేకు అందుబాటులో లేకుంటే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకునే అవకాశం ఉంది. త్వరలో ఈ విషయంపై జట్టు యాజమాన్యం స్పష్టత ఇవ్వనుంది.
ప్రపంచకప్‌కు ముందు చివరి సిరీస్ ఆడనుంది టీమిండియా. కంగారూలతో 5 వన్డేల సిరీస్ రేపే ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన వన్డేల్లో నెగ్గాలనే పట్టుదలతో ఉంది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి వన్డే మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.