తెలంగాణ

telangana

ETV Bharat / sports

త్రుటిలో శతకం చేజార్చుకున్న శిఖర్​

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటయ్యాడు. 90 బంతుల్లో 96 పరుగులు చేసి, త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు.

Dhawan Centuary miss In Rajkot ODI
శిఖర్ ధావన్​

By

Published : Jan 17, 2020, 3:57 PM IST

Updated : Jan 17, 2020, 4:22 PM IST

రాజ్​కోట్​లోఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శిఖర్ ధావన్(96) కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. కేన్ రిచర్డ్​సన్​ బౌలింగ్​లో షాట్​ కొట్టగా బౌండరీలైన్ వద్ద స్టార్క్ బంతిని ఒడిసి పట్టాడు. ఫలితంగా 103 పరుగుల కోహ్లీ - ధావన్ భాగస్వామ్యానికి తెరపడింది.

మొదట్లో ధాటిగా ఆడిన గబ్బర్.. అనంతరం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఓవర్లోనే చూడచక్కని స్ట్రైట్​ డ్రైవ్​ కొట్టి బౌండరీ సాధించాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. అగర్ బౌలింగ్​లో సిక్సర్​, ఫోర్​ కొట్టి 90ల్లో అడుగుపెట్టిన ధావన్.. రిచర్డ్​సన్ బౌలింగ్​లో వెనుదిరిగాడు. శిఖర్ ఇన్నింగ్స్​లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.

గత ఐదు వన్డేల్లో రెండు సెంచరీలు

ఆసీస్​తో ఆడిన గత ఐదు వన్డేల్లో, ధావన్ రెండు శతకాలు, రెండు అర్ధసెంచరీలు చేశాడు. 143, 12, 117, 74, 50*తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్​లో 96 పరుగుల వద్ద ఔటై, శతకం చేజార్చుకున్నాడు.

కాసేపటికే శ్రేయస్ అయ్యర్.. ఆడం జంపా చేతిలో బౌల్డయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. కోహ్లీ అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నాడు.

ఇదీ చదవండి: భారత్​X ఆస్ట్రేలియా: రెండో వన్డేలో ధావన్​ అర్ధశతకం

Last Updated : Jan 17, 2020, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details