తనదైన దూకుడైన ప్రదర్శనతో విధ్వంసకర ఓపెనర్‌గా పేరుతెచ్చుకున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. అలాగే కళ్లు చెదిరే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెడుతూ అనతి కాలంలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. అయితే తాజాగా ఆసీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆర్చర్ బంతికి వార్నర్ భయపడిపోయాడు. అతడు వేసిన మూడు బంతులను ఆడటానికి వార్నర్ ఇబ్బందిపట్టాడు.
ఆర్చర్ బంతికి వార్నర్‌కు దేవుడు గుర్తొచ్చాడు!
ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆర్చర్ వేసిన బంతిని ఆడటంలో ఇబ్బందిపడ్డాడు డేవిడ్ వార్నర్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆర్చర్ వేసిన మూడో బంతి వేగంగా వార్నర్‌పైకి దూసుకొచ్చింది. దాన్ని ఆడడంలో అతను ఇబ్బందిపడ్డాడు. బంతి భుజం కింది వైపు తాకుతూ బట్లర్ చేతిలో పడింది. దాని వేగానికి అదిరిపోయిన వార్నర్ 'ఓ జీసస్' అంటూ గట్టిగా అరిచాడు. ఈ మాటలు స్టంప్ మైక్స్‌లో రికార్డయ్యాయి. అంపైర్ దానిని ఔట్‌గా ప్రకటించగా దానిపై వార్నర్ సమీక్షకు వెళ్లాడు. గ్లౌవ్స్‌ను తాకుతూ బంతి కీపర్ చేతిలో పడింది. ఇది టీవీ రిప్లేలో స్పష్టంగా కనపడింది. దీంతో వార్నర్ మైదానాన్ని వీడక తప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (40), స్టొయినిస్ (35) రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపు సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.