తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐవీ స్వింగ్‌ చూసి అసూయ కలిగింది: వార్నర్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్​డౌన్ సమయంలో టిక్​టాక్ వీడియోలతో సందడి చేశాడు. ప్రస్తుతం ఇండియాలో టిక్​టాక్ బ్యాన్ చేయడం వల్ల వేరే సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుంటున్నాడు. తాజాగా తన కూతుళ్లతో ఆడుకుంటోన్న వీడియోను షేర్ చేశాడు.

ఐవీ స్వింగ్‌ చూసి అసూయ కలిగింది: వార్నర్
ఐవీ స్వింగ్‌ చూసి అసూయ కలిగింది: వార్నర్

By

Published : Jul 15, 2020, 9:11 PM IST

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ లాక్‌డౌన్‌ సమయంలో టిక్‌టాక్‌ చేస్తూ దుమ్మురేపాడు. తన సతీమణి క్యాండిస్‌ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా, బ్యాంగ్‌బ్యాంగ్‌ వంటి పాటలను అనుకరిస్తూ అలరించాడు.

ఇప్పుడేమో భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు. అయినప్పటికీ వార్నర్‌ ఇతర సోషల్‌మీడియా వేదికలను ఉపయోగించుకొని అభిమానులకు కనెక్ట్‌ అవుతున్నాడు. తాజాగా తన కుమార్తెతో ఐవీతో కలిసి క్రికెట్‌ ఆడాడు. ఆమెకు బంతులు విసిరాడు. వరుసగా రెండు క్యాచులు అందుకున్న అతడు మూడో బంతికి హ్యాట్రిక్‌ సాధించాలనుకున్నాడు. కానీ ఐవీ అతడి ఆటలు సాగనివ్వలేదు. బంతిని లెగ్‌సైడ్‌ కొట్టింది.

ఇక మరో వీడియోలో ఐవీ.. గోల్ఫ్‌ బంతిని ఒడుపుగా కొట్టిన విధానం చూసి వార్నర్‌ ఆశ్చర్యపోయాడు. ఎంత అద్భుతంగా స్వింగ్‌ చేసిందో అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ స్వింగ్‌ చూసి తనకు ఈర్ష్య కలిగిందని చెప్పాడు. లాక్‌డౌన్‌లో తన కుమార్తెల మధ్య బంధీ అయ్యానని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి అంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details