న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయల బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదు అందింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో వీరి బౌలింగ్ సరళిపై అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ ఈ విషయమై ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
ఇద్దరూ 14 రోజుల్లో ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలింగ్ యాక్షన్‌పై పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ కాలంలో వారిద్దరూ యథాతథంగా బౌలింగ్ చేసుకోవచ్చు. ఒకవేల యాక్షన్ విరుద్ధంగా ఉందని తేలితే వీరి బౌలింగ్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది.