తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలిమ్యాచ్ ద్వారా వచ్చే మొత్తం.. పుల్వామా బాధితులకు - mtches

ఐపీఎల్ తొలి పోరులో బెంగళూరుతో తలపడనుంది చెన్నై. మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని పుల్వామా బాధితులకు ఇవ్వనుంది సీఎస్​కే జట్టు. మహేంద్ర సింగ్ ధోనీ..బాధిత కుటుంబాలకు చెక్ అందజేయనున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్

By

Published : Mar 21, 2019, 11:39 AM IST

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాయం ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్​ ద్వారా వచ్చే మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వనుంది.

ఐపీఎల్-12వ సీజన్ తొలి పోరు చెన్నై చెపాక్​లో సీఎస్​కే, ఆర్సీబీ జట్ల మధ్య జరగనుంది. మార్చి 23న జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విక్రయానికి పెట్టిన కొన్ని గంటల్లోనే మ్యాచ్​ టిక్కెట్లన్నీ అమ్ముడు పోయాయి.

చెన్నై సూపర్ కింగ్స్

"చెన్నైలో జరిగే తొలిమ్యాచ్​ ద్వారా వచ్చే డబ్బును పుల్వామా ఘటనలోని బాధిత కుటుంబాలకు ఇవ్వనున్నాం. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారికి చెక్​ను అందజేయనున్నాడు" --రాకేశ్ సింగ్, సీఎస్​కే జట్టు డైరెక్టర్

ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. పాక్​కు చెందిన జైష్ ఏ మహ్మద్ తీవ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details