భారత ఓపెనర్ రోహిత్ శర్మ మూడు నెలల క్రితం తండ్రి అయిన విషయం తెలిసిందే. రోహిత్, రితికా దంపతులకు ఆడపిల్ల పుట్టింది. తనకు ‘సమైరా’ అని పేరు పెట్టారు. మ్యాచ్‌లు లేని సమయంలో ఈ హిట్టర్ తన ముద్దుల కూతురితోనే ఎక్కువగా ఆడుతుంటాడు. అయితే ఇటీవల సమైరాకు రోహిత్ జోలపాట పాడుతున్న వీడియోను అతడి భార్య రితికా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
నిజంగా పాట పాడకపోయినా బాలీవుడ్ చిత్రం ‘గల్లీబాయ్’లోని పాటకు రోహిత్ చిన్నగా గొంతు కలిపాడు. రోహిత్ పాటకు సమైరా
నిశ్శబ్దంగా
ఉండిపోయింది. ఈ వీడియో చూసి 'అప్‌డేటెడ్ తండ్రికి సినిమా పాటలు కూడా జోలపాటలే' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.