తెలంగాణ

telangana

ETV Bharat / sports

భజ్జీ దృష్టిలో 4వ స్థానానికి ఆ ఆటగాడే సరి! - sanju samson

టీమిండియా నాలుగో స్థానానికి యువ ఆటగాడు సంజు శాంసన్​ను ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ సూచించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో 91 పరుగులతో సత్తాచాటాడు సంజు.

హర్భజన్

By

Published : Sep 7, 2019, 5:04 AM IST

Updated : Sep 29, 2019, 5:45 PM IST

టీమిండియాకు అతి పెద్ద సమస్యగా మారిన నాలుగో స్థానంపై ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతుంది యాజమాన్యం. రోజుకో పేరు వినిపిస్తున్నా.. స్థిరమైన ఆటగాడి కోసం వేట కొనసాగిస్తున్నారు సెలెక్టర్లు. తాజాగా ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆ స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్​ను తీసుకోవాలని సూచించాడు.

"నాలుగో స్థానానికి సంజు శాంసన్​ను ఎందుకు తీసుకోకూడదు? మంచి టెక్నిక్​తో పాటు అద్భుత ప్రదర్శన చేయగలడు. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన చివరి వన్డేలో సత్తాచాటాడు".
-హర్భజన్ సింగ్, టీమిండియా ఆటగాడు

ఈరోజు దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక ఐదో వన్డేలో 48 బంతుల్లో 91 పరుగులతో సత్తాచాటాడు సంజు శాంసన్. ఇందులో 7 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి.

త్వరలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20, మూడు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్​తో కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. నాలుగో స్థానంపై తనకు ఓ అవగాహన ఉందన్న విక్రమ్​.. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్​లను పరిశీలిస్తామని చెప్పాడు. ఇప్పుడు కొత్తగా సంజు శాంసన్ పేరు వెలుగులోకి వచ్చింది.

ఇవీ చూడండి.. చెలరేగిన శాంసన్.. భారత్​-ఏ విజయం​

Last Updated : Sep 29, 2019, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details