తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ రిటైర్​లో కరోనా కీలక పాత్ర పోషించింది' - ధోనీ రిటైర్​లో కరోనా కీలక పాత్ర

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ రిటైర్మెంట్​ నిర్ణయంలో కరోనా కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డాడు స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​. ఈ వైరస్​ లేకపోయుంటే 2022కు వాయిదా పడ్డ టీ20 ప్రపంచకప్​లో మహీ ఆడి ఉండేవాడని తెలిపాడు.

COVID-19 played a role in Dhoni's retirement: Chahal
'ధోనీ రిటైర్​లో కరోనా కీలక పాత్ర పోషించింది'

By

Published : Aug 18, 2020, 9:31 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​. మహీ వీడ్కోలు నిర్ణయంలో ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. ఈ వైరస్​ లేకపోయి ఉంటే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​లో ధోనీ ఆడి ఉండేవాడని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ప్రపంచకప్​ కరోనా కారణంగా 2022కు వాయిదా పడింది. మహీ టీమ్​ఇండియా తరఫున మైదానంలో ఇంకా ఆడాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పాడు చాహల్.

ధోనీ వల్లే స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్, తాను బౌలర్లుగా ​విజయవంతంగా రాణిస్తున్నామని తెలిపాడు చాహల్. మహీకి పిచ్​పై బౌలింగ్​ను ఎలా ఎదుర్కోవాలో, ఎలా వేయాలో బాగా తెలుసని చెప్పాడు. కెరీర్​లో 52 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు చాహల్​. ఐపీఎల్​ 13వ సీజన్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇది చూడండి 'ధోనీ సాధించడానికి ఇంకేమీ మిగల్లేదు.. శకం ముగిసింది'

ABOUT THE AUTHOR

...view details