టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ మళ్లీ జట్టుతో కలిశాడు. ఇటీవల భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. తాజాగా ఈ విషయమై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు నట్టూ.
ఫిట్‌నెస్ పాస్.. నెట్టింట ఫిలాసఫీ క్లాస్ - నటరాజన్ ఫిలాసఫీ
టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసవ్వడంపై స్పందించాడు. ఇష్టమైన పనిని వృత్తిగా ఎంచుకుంటే జీవితంలో పని చేయాల్సిన రోజే ఉండదని తెలిపాడు.
"బ్లూ జెర్సీలో మళ్లీ టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలవడం ఉత్సాహంగా ఉంది. అలాగే మీకు ఇష్టమైన పనిని వృత్తిగా ఎంచుకోండి. అలా చేస్తే జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదు" అని నటరాజన్ అన్నాడు.
గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన చేయడం వల్ల ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా నటరాజన్ ఎంపికయ్యాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి కొత్త రికార్డు నెలకొల్పడమే కాకుండా తన ఎంపికకు న్యాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే వచ్చేవారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ నటరాజన్‌ను ఎంపిక చేసింది.