తెలంగాణ

telangana

ETV Bharat / sports

కౌంటీల్లో గ్లోస్టర్​షైర్​కు ఆడనున్న పుజారా - Cheteshwar Pujara signs for Gloucestershire for six County Championship games

భారత టెస్టు ఆటగాడు పుజారా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్ షిప్​లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 12 నుంచి ఆరంభమయ్యే సీజన్​లో గ్లోస్టర్​షైర్​కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

పుజారా
పుజారా

By

Published : Feb 20, 2020, 10:03 AM IST

Updated : Mar 1, 2020, 10:25 PM IST

భారత టెస్టు ఆటగాడు చెతేశ్వర్‌ పుజారా ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లోస్టర్‌షైర్‌ తరపున బరిలో దిగనున్నాడు. ఏప్రిల్‌ 12 నుంచి ఆరంభమయ్యే సీజన్‌ కోసం అతను ఆ జట్టుతో కలిసి ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా జవగళ్‌ శ్రీనాథ్‌ (1995) తర్వాత కౌంటీల్లో ఆ జట్టు తరపున ఆడనున్న భారత క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. ఇదివరకు అతను కౌంటీల్లో డెర్బీషైర్‌, యార్క్‌షైర్‌, నాటింగ్‌హమ్‌షైర్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Last Updated : Mar 1, 2020, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details