విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతిసారి ఐపీఎల్లో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతోంది. చివరిసారిగా 2016లో ఈ జట్టు లీగ్‌లో ఫైనల్ చేరింది. మొత్తంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మూడుసార్లు మాత్రమే తుదిపోరుకు అర్హత సాధించింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్‌ను దక్కించుకోవడంలో సఫలం కాలేదు. కానీ ఈసారి వేలంలో అనుభవజ్ఞులు, ప్రతిభ గల యువ ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్సీబీ ఎలాగైనా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. తాజాగా ఇదే విషయమై సారథి కోహ్లీ స్పందించాడు. ఈసారి లీగ్‌లో అద్భుతం జరగబోతుందంటూ చెప్పాడు.
"ఐపీఎల్ సీజన్‌కు ముందు నేనూ, డివిలియర్స్ ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా లేము. ఏబీ ఈసారి కొత్తగా ఉన్నాడు. అతడు తన సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేశాడు. అతడు ఇప్పటికీ 2011లో ఆడినట్లే ఆడుతున్నాడు. అలాగే నాకూ ఈ విరామ సమయం గొప్పగా అనిపించింది. గతంలో ఏం జరిగిందనేది అనవసరం. ప్రస్తుతం ఈ టోర్నీపైనే మా దృష్టంతా. ఏం చేసినా జట్టుగా చేస్తాం. ఈసారి అద్భుతం జరగబోతుంది."