ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని బెంగుళూరు జట్టు సాధించడానికి.. తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తెలిపాడు. గురువారం చెన్నై వేదికగా జరిగిన వేలంలో ఆర్సీబీ.. అతన్ని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది.
"ఈ సంవత్సరం ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆర్సీబీ కప్ సాధించడానికి నేను అన్ని విధాలుగా కృషి చేస్తాను" అని మాక్స్వెల్ ట్వీట్ చేశాడు.
మాక్స్వెల్ కోసం జరిగిన వేలంలో కేకేఆర్, సీఎస్కే, ఆర్సీబీ జట్లు పోటీ పడ్డాయి. చివరికి బెంగుళూర్ జట్టు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ కైల్ జేమిసన్ను కూడా ఆర్సీబీనే సొంతం చేసుకుంది. అతని కోసం రూ.15 కోట్లు వెచ్చించింది.
కాగా, చెన్నై వేదికగా జరిగిన వేలంలో రూ.16.25 కోట్లకు అమ్ముడుపోయిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్.. ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. అత్యధిక ధర పొందిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు.
ఇదీ చదవండి:ఏడేళ్లకు ఐపీఎల్లోకి పుజారా- చెన్నైకి కృతజ్ఞతలు