జనవరిలో ప్రారంభమయ్యే శ్రీలంక, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నారు. వెన్నుగాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా తాజాగా జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు.
"శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు బుమ్రాతో పాటు ధావన్‌ను ఎంపిక చేశాం. రోహిత్ శర్మ, మహ్మద్ షమీలకు లంకతో జరిగే టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చాం. ఈ సిరీస్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా సంజు శాంసన్‌కు చోటు కల్పించాం."
-ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్
జనవరి 5నుంచి శ్రీలంకతో మూడు టీ20లు ఆడనుంది టీమిండియా. జనవరి 14న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జట్టు