తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అన్ని ఫార్మాట్​ల​లో బుమ్రా ఆడకూడదు'

టీమ్​ఇండియా పేసర్​ బుమ్రా అన్ని ఫార్మాట్​లలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. అతడి భిన్నమైన శైలి వల్ల అది వీలుకాదని తెలిపాడు.

'అన్ని ఫార్మాట్​ల​లో బుమ్రా ఆడకూడదు'
'అన్ని ఫార్మాట్​ల​లో బుమ్రా ఆడకూడదు'

By

Published : Aug 9, 2020, 5:31 AM IST

టీమ్​ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్​ శైలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. భిన్నమైన శైలి బౌలింగ్​తో ఆకట్టుకునే ఈ పేసర్​ వేసే యార్కర్లను ఎదుర్కోవడం బ్యాట్స్​మెన్​కు సవాలు లాంటిది. ఈ మధ్య స్వింగ్​లోనూ సత్తాచాటుతున్న బుమ్రా ఎక్కువ కాలం మూడు ఫార్మాట్​లో నిలదొక్కుకోవడం కష్టమని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.

"బుమ్రాది భిన్నమైన శైలి. అతడు అన్ని ఫార్మాట్​లలో ఆడకూడదు. టెస్టు మ్యాచ్​ల్లోనూ రాణించడమనేది అతడి ధైర్యానికి నిదర్శనం. అతడు చాలా కష్టపడుతూ, ఆటపై శ్రద్ధ పెడతాడు. ఏం సాధించాలనుకుంటున్నాడో అతడికి తెలుసు. కానీ అతడి వెన్ను సపోర్ట్ చేసినంతవరకే అది వీలవుతుంది. కానీ మూడు ఫార్మాట్​లలో ఆడటం వల్ల అతడి వెన్నుముకపై అధిక భారం పడి దెబ్బతినే అవకాశం ఉంది."

-షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్​తో టెస్టు అరంగేట్రం చేసిన బుమ్రా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. 2019లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్​ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడీ పేసర్.​

ABOUT THE AUTHOR

...view details