తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాయంత్రం మ్యాచ్​లో అన్నదమ్ముల సవాల్​ - deepak chahar

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్, ముంబయి ఇండియన్స్ జట్టులోని రాహుల్ చాహర్ అన్నదమ్ములు. వీరిద్దరూ నేడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.

;ాహర్ సోదరులు

By

Published : Apr 26, 2019, 2:32 PM IST

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నైతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. రెండూ ఐపీఎల్​లో విజయవంతమైన జట్లుగా పేరుగాంచాయి. మరో ఆసక్తికర విషయమేంటంటే సొంత అన్నదమ్ములిద్దరూ ప్రత్యర్థులుగా బరిలో దిగనున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్​లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు దీపక్ చాహర్. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో రాణిస్తున్నాడు. ఇప్పటికి 11 మ్యాచ్​లాడి 14 వికెట్లు తీశాడు.

ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతున్న మరో బౌలర్ రాహుల్ చాహర్. 7 మ్యాచ్​ల్లో 9 వికట్లు తీశాడు. ఎకానమీ 6.6తో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.
వీరిద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం. మరి ప్రత్యర్థులుగా ఎలా రాణిస్తారో చూడాలి.

ముంబయి జట్టులో ఇప్పటికే హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మంచి గుర్తింపు సాధించారు. ఐపీఎల్​లో మంచి ప్రదర్శన చేసి వీరిద్దరు కూడా భారత్ తరఫున ఆడాలని అనుకుంటున్నారు.

ఇవీ చూడండి.. 'ఆసియన్ బాక్సింగ్ ఛాంప్​'లో భారత్​కు పసిడి

ABOUT THE AUTHOR

...view details