వెస్టిండీస్ టెస్టు కెప్టెన్‌గా క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను నియమించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. జాసన్ హోల్డర్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు.
హోల్డర్ గైర్హాజరీలో ఇంతకుముందు బ్రాత్‌వైట్.. 7 టెస్టుల్లో కరీబియన్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌పై 2-0తో గెలిచిన సిరీస్‌కు కూడా నేతృత్వం వహించింది బ్రాత్‌వైటే.
37 టెస్టుల్లో 11 విజయాలు..
హోల్డర్ 37 టెస్టుల్లో కెప్టెన్‌గా చేశాడు. ఇందులో 11 విజయాలు ఉన్నాయి. 21 ఓటములు ఎదుర్కోగా, 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2015లో దినేశ్ రామ్‌దిన్ నుంచి పగ్గాలు చేపట్టాడు హోల్డర్. ఇతడు.. ప్రస్తుతం టెస్టుల్లో ప్రపంచ నెం.1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు.
హోల్డర్.. వెస్టిండీస్ క్రికెట్‌ను మరింత పైకి తీసుకెళ్లాడని అన్నారు క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్. మరిన్ని సంవత్సరాలు.. జట్టులో రాణించాలని అభిప్రాయపడ్డారు.
తనకు టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు అప్పగించినందుకు.. సెలక్టర్లకు, బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు బ్రాత్‌వైట్. జట్టును మరింత ముందుకు తీసుకెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి:ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా టీకా