సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఇద్దరు పురుషులు స్విమ్మింగ్ పూల్ మీదుగా ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి క్రికెట్ ఆడుతున్నారు. బౌలర్ బంతిని స్విమ్మింగ్ పూల్‌లో స్టెప్పు వేయగా.. అది అనుకోని రీతిలో బౌన్స్ అయ్యింది. అదే వేగంతో వచ్చి బ్యాట్స్‌మన్ ముఖాన్ని తాకింది. బ్యాట్స్‌మన్ బంతి నుంచి తప్పించుకుందాం అని చూసినా.. అది కుదరలేదు. దాంతో బౌలర్ నవ్వు ఆపుకోలేక పోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోందీ వీడియో. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
నీటిపై బౌన్స్ అయింది.. బ్యాట్స్‌మన్ దిమ్మతిరిగింది - క్రికెట్ న్యూస్
మైదానంపై బంతి బౌన్స్ అవ్వడం చూశాం.. కానీ, నీటిపై కూడా వేగంగా బౌన్స్ అవుతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. అలా బౌన్స్యి బ్యాట్స్‌మన్ ముఖం వాచేలా చేసింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు నవ్వులు చిందిస్తున్నారు. ఇంక ఎందుకు ఆలస్యం ఆ వీడియో ఏంటో మీరూ చూసేయండి.
నీటిపై బౌన్స్ అయింది.. బ్యాట్స్‌మన్ దిమ్మతిరిగింది
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ టోర్నీలు నిలిచిపోయాయి. మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ లాక్డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చూడండి...'రోహిత్‌కు టీ20 పగ్గాలు అప్పగించండి'