క్రికెట్లో అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ ఆదాయం భారీగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం బ్యాలెన్స్ షీట్‌లో నికర విలువను రూ.14,489.80 కోట్లుగా బోర్డు పేర్కొంది. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే రూ.2,597.19 కోట్లు ఎక్కువ ఆదాయం సంపాదించింది.
బీసీసీఐ ఆదాయం పైపైకి.. రూ.5 వేల కోట్లు ఎక్కువ
భారత క్రికెట్ బోర్డు ఆదాయం భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.2597.19 కోట్ల అదనంగా వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు
2018లో బీసీసీఐ ఆర్జించిన రూ.4,017.11 కోట్లలో సగం కంటే ఎక్కువ మొత్తం (రూ.2,407.46 కోట్లు) ఐపీఎల్ నిర్వహణతో వచ్చినవే. స్వదేశంలో సిరీస్/టోర్నీలు నిర్వహించినందుకు రూ.446 కోట్లు వచ్చాయి. 2019-20 బ్యాలెన్స్ షీట్ ఇంకా సిద్ధం కాలేదు. 2014-15లో బీసీసీఐ నికర విలువ రూ.5438.61 కోట్లు.. నాలుగేళ్లలో అది రూ.14489 కోట్లకు చేరడం విశేషం.
Last Updated : Jan 6, 2021, 10:01 AM IST