టీమ్ఇండియా వచ్చే నెల 5 నుంచి ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాల్లోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మిగతా రెండు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆ దేశ బోర్డు అనుభవాలను బీసీసీఐ అడిగి తెలుసుకోనుంది.
"త్వరలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు 50 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించాం. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు, ఆరోగ్య అధికారులతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. తగిన జాగ్రత్తలతో అందుకు అంగీకారం లభిస్తే.. తదుపరి ఐపీఎల్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.