తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరుద్ధ ప్రయోజనాల అంశంలో ద్రవిడ్​కు ఊరట

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్​కు ఊరట లభించింది. విరుద్ధ ప్రయోజనాల అంశంలో తనపై దాఖలైన ఫిర్యాదును కొట్టేశారు.

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్

By

Published : Nov 15, 2019, 7:50 AM IST

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదంలో ఊరట లభించింది. ద్రవిడ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి డి.కె.జైన్‌ గురువారం కొట్టివేశాడు.

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్

ఇండియా సిమెంట్స్‌లో ఉద్యోగిగా ఉన్న ద్రవిడ్‌.. ఎన్‌సీఏ డైరెక్టర్‌ పదవి చేపట్టడం విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన జైన్‌.. ద్రవిడ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చాడు.

ఇది చదవండి: ద్రవిడ్​ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం

ABOUT THE AUTHOR

...view details