మయాంక్ అగర్వాల్.. ఆరు నెలల క్రితం వరకు భారత వన్డే క్రికెట్ జట్టులో స్థానం దక్కితే గొప్ప విషయం అతడిది.. కట్ చేస్తే మూడు పార్మాట్లలోనూ ఆడే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఇటీవల టెస్టు సిరీస్‌లో తనదైన శైలిలో విజృంభించి తాజాగా విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఎరుపు బంతి క్రికెట్ నుంచి తెల్ల బంతికి ఏ విధంగా మారాడో చెప్పాడు మయాంక్.
"మనస్ఫూర్తిగా క్రికెట్ ఆడలేకపోతే.. అసలు ఆట ఆడకుండా ఉంటేనే మంచిది. అదే నేను నమ్ముతా. క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా మూలాలు ఒకేలా ఉంటాయి. ఫార్మాట్ మారినప్పుడు గేమ్ ప్లాన్ స్పష్టంగా ఉండి.. ఆటను అర్థం చేసుకోగలిగితే ఎందులోనైనా రాణించగలం. మ్యాచ్ ఆడేటప్పుడు జట్టుకు నేనెలా ఉపయోగపడగలను, ఏ మేరకు ఆకట్టుకోగలను అనేదే ఆలోచిస్తా. ఒకవేళ నేను పరుగులు చేయనప్పటికీ.. ఫీల్డింగ్‌లో సత్తాచాటేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా" -మయాంక్ అగర్వాల్, టీమిండియా క్రికెటర్.