భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు విరుచుకుపడ్డారు. ఫలితంగా బంగ్లాదేశ్.. మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమి 3 వికెట్లతో ఆకట్టుకోగా.. అశ్విన్, ఉమేశ్, ఇషాంత్ తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫీకర్ రహీమ్‌దే(43) అత్యుత్తమ స్కోరు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్దే ఓపెనర్ ఇమ్రుల్ కేయస్(6) వికెట్ తీసి దెబ్బతీశాడు ఇషాంత్. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్‌ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్. క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్‌ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.
అనంతరం కెప్టెన్ మోమినుల్ హక్(37) - ముష్ఫికర్ రహీమ్(43) జోడీ బంగ్లా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలకడగా ఆడుకున్న మోమినుల్‌ను ఔట్ చేసి బంగ్లాను దెబ్బతీశాడు అశ్విన్. అక్కడి నుంచి బంగ్లా బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు.
షమి ఒకే ఓవర్లో..