తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్ కోహ్లీ కంటే అతడే గొప్ప క్రికెటర్' - CRICKET NEWS

ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించే సత్తా పాక్ క్రికెటర్ బాబర్ అజమ్​కు ఉందని అన్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా.

virat kohli news
విరాట్ కోహ్లీ

By

Published : Apr 14, 2020, 7:38 PM IST

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజా రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీపైనే గురిపెట్టాడు. ఇతడి కంటే పాక్ యువ క్రికెటర్ బాబర్ అజమ్ గొప్ప ఆటగాడని అన్నాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు.

"బాబర్ అద్భుతమైన బ్యాట్స్​మన్. కోహ్లీ, స్మిత్​లతో పోలిస్తే ఇతడు మరింత బాగా ఆడగలడు. వారి రికార్డులను అధిగమించగలిగే సత్తా అతడికి ఉంది. అయితే అందుకోసం బాబర్​కు జట్టులో అనువైన పరిస్థితులు కల్పించాలి. సారథిగా, ఆటగాడిగా మరింత స్వేచ్ఛనివ్వాలి" -రమీజ్ రాజా, పాక్ మాజీ క్రికెటర్

రమీజ్ రాజా- పాక్ యువక్రికెటర్ బాబర్ అజమ్

ప్రస్తుతం పాక్​ తరఫున ఆడుతున్న మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్​లు గౌరవప్రదంగా జట్టు నుంచి తప్పుకోవాలని అన్నాడు రమీజ్.

ABOUT THE AUTHOR

...view details