తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫించ్​- స్టార్క్​ మెరుపులతో ఆసీస్​ గెలుపు - STARC

శనివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్​లో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. 153 పరుగులు చేసిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. బౌలింగ్​లో స్టార్క్ 4 వికెట్లతో ఆసీస్​ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లంక కెప్టెన్ కరుణరత్నే(97 పరుగులు) పోరాటం వృథా అయింది. ​

సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియాదే విజయం

By

Published : Jun 15, 2019, 11:27 PM IST

ఓవల్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్​ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆసీస్.. ఈ ప్రపంచకప్​లో నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. లంక కెప్టెన్ కరుణరత్నే 97 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగింది ఆస్ట్రేలియా. తొలి వికెట్​కు 80 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది ఫించ్- వార్నర్ జోడి. అనంతరం 26 పరుగులు చేసి వార్నర్ ఔటయ్యాడు. వార్నర్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఖవాజా 10 పరుగులకే వెనుదిరిగాడు.

కెప్టెన్ అదరగొట్టాడు

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్​తో కలిసి మూడో వికెట్​కు 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆసీస్ కెప్టెన్. ఈ క్రమంలో 153 పరుగులు చేశాడు. స్మిత్ 73 పరుగులు చేసి మలింగ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

చివర్లో మాక్స్​వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 25 బంతుల్లో 46 పరుగులు చేసిన జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. మిగతా వారిలో షాన్ మార్ష్ 3, కేరీ 4, కమిన్స్ 0, స్టార్క్ 5 పరుగులు చేశారు.

లంక బౌలర్లలో ఉదానా, డిసిల్వా తలో రెండు వికెట్లు, మలింగ ఒక వికెట్ దక్కించుకున్నారు.

ప్రారంభం అదిరింది కానీ...

అనంతరం 335 లక్ష్యంతో బరిలో దిగిన లంక.. ఛేదన ధాటిగానే ఆరంభించింది. తొలి వికెట్​కు 115 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు. అనంతరం కెప్టెన్ కరుణరత్నే ఓ ఎండ్​లో వేగంగా ఆడుతున్నా అతడికి సహకారమందించే వారు కరవయ్యారు. ఈ క్రమంలో 97 పరుగులు చేసి లంక సారథి పెవిలియన్ బాట పట్టాడు.

శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే

మిగతా వారిలో కుశాల్ పెరీరా 52, తిరుమన్నే 16, కుశాల్ మెండిస్ 30, మాథ్యూస్ 9, సిరివర్ధన 3, తిశారీ పెరీరా 7, ధనుంజయ డిసిల్వా 16, ప్రదీప్ 0, మలింగ 1, ఉదానా 8 పరుగులు చేశారు.

కంగారూ బౌలర్లలో స్టార్క్ 4, రిచర్డ్​సన్ 3, కమిన్స్ 2, బెహరాన్​డార్ఫ్ 1 వికెట్ తీశారు.

ప్రపంచకప్​ పాయింట్ల పట్టిక

ABOUT THE AUTHOR

...view details