తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​ సిరీస్ : బౌలర్ల చేతిలో రెండో టెస్టు ఫలితం

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. చివరి రోజైన ఆదివారం పిచ్​ బౌలర్లకు అనుకూలిస్తే ఫలితం వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఇంగ్లాండ్.. 96/4తో ఉంది.

By

Published : Aug 18, 2019, 7:35 AM IST

Updated : Sep 27, 2019, 8:53 AM IST

ఆసక్తికరంగా యాషెస్​ రెండో టెస్టు

యాషెస్​ రెండో టెస్టులో వరుణుడు ఇబ్బంది పెట్టినా ఆట రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఓపెనర్లు రోరీ బర్న్స్‌ (29), జేసన్‌ రాయ్‌ (2)లతో పాటు కెప్టెన్‌ జో రూట్‌ (0), డెన్లీ (26) వెనుదిరిగారు. స్టోక్స్‌ (16 బ్యాటింగ్‌), బట్లర్‌ (10 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 6 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లాండ్‌కు 104 పరుగుల ఆధిక్యం ఉంది. చివరి రోజైన ఆదివారం వాతావరణం అనుకూలించి, బౌలర్ల జోరు కొనసాగితే ఫలితం వచ్చేందుకు అవకాశముంది.

అంతకు ముందు నాలుగోరోజు 80/4తో తొలి ఇన్నింగ్స్​ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్​(92:161 బంతుల్లో 14×4) అద్భుత పోరాటంతో 250 పరుగులకు ఆలౌట్​ అయింది. నాలుగో రోజు 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన అతడు.. పైన్‌ (23), కమిన్స్‌ (20)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఆర్చర్‌ బౌలింగ్​లో రెండు సార్లు గాయపడి రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు స్మిత్‌. అయినా తిరిగి బ్యాటింగ్​కు దిగి పోరాటం కొనసాగించాడు. 234 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ రూపంలో వెనుదిరగాడు. అనంతరం 16 పరుగులు జోడించి ఆసీస్ ఇన్నింగ్స్ ముగించింది.

ఇది చదవండి: 11 సెకన్లలో 100మీ పరుగు-కేంద్ర క్రీడామంత్రి ఫిదా

Last Updated : Sep 27, 2019, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details