తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​: స్మిత్​ 'డబుల్​'... పటిష్ఠ స్థితిలో ఆసీస్​

యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్​ డబుల్​ సెంచరీ చేశాడు. ఫలితంగా నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 8 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసి డిక్లేర్​ చేసింది. ఇంగ్లీష్​ బౌలర్లలో బ్రాడ్​ 3 వికెట్లు, లీచ్​, ఓవర్టన్​ చెరో రెండు వికెట్లు సాధించారు.

యాషెస్​: డబుల్​ సెంచరీతో అదరగొట్టిన స్మిత్​

By

Published : Sep 6, 2019, 7:59 AM IST

Updated : Sep 29, 2019, 2:58 PM IST

మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న యాషెస్​ నాలుగో టెస్టులో ఆసీస్​ భారీ స్కోరు సాధించింది. సీనియర్​ బ్యాట్స్​మెన్ స్టీవ్​ స్మిత్​​ 319 బంతుల్లో 211 పరుగులు (24 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 497 పరుగుల వద్ద ఇన్నింగ్స్​ డిక్లేర్‌ చేసింది.

స్మిత్​ విలువైన భాగస్వామ్యం...

ఓవర్‌నైట్‌ స్కోరు 170 పరుగుల (3 వికెట్ల నష్టానికి) వద్ద గురువారం ఆట కొనసాగించిన ఆసీస్‌... వేగంగా ఆడింది. కంగారూ జట్టు స్టార్​ క్రికెటర్​ స్మిత్‌...పైన్​, స్టార్క్​తో కలిసి ఇంగ్లాండ్​ బౌలర్లను ఆడుకున్నాడు. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ 127 బంతుల్లో 58 పరుగులు (8 ఫోర్లు), లోయర్​ ఆర్డర్‌లో మిచెల్‌ స్టార్క్‌ 58 బంతుల్లో 54 నాటౌట్‌ (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు.

అంతకుముందు హెడ్‌ (19), వేడ్‌ (16) త్వరగానే వెనుదిరిగినా.... పైన్‌తో ఆరో వికెట్‌కు 145 పరుగులు జోడించాడు స్మిత్​. 8వ వికెట్‌కు స్టార్క్‌తో కలిసి 51 పరుగులు జోడించి జట్టును గాడిన పెట్టాడు. ఈ క్రమంలో 160 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 118 పరుగుల వద్ద స్పిన్నర్‌ లీచ్‌ బౌలింగ్‌లో... స్లిప్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చినా అది నోబాల్‌ కావడం వల్ల నాటౌట్​గా బతికిపోయాడు.

తన ఫామ్​ను కొనసాగిస్తూ కెరీర్‌లో మూడో డబుల్​ సెంచరీ (310 బంతుల్లో) సాధించాడు. అనంతరం పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.

వన్డేలా ఆడేశారు...

స్మిత్​ ఔటయ్యాక స్టార్క్, లైయన్‌ వేగంగా ఆడారు. వన్డే తరహాలో ఈ జోడీ 49 బంతుల్లో 59 పరుగులు చేసింది. ఆసీస్‌ ఆఖరి 10 ఓవర్లలో 80 పరుగులకు పైగా చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌కు 3, లీచ్‌, ఓవర్టన్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి.

వికెట్​ డౌన్​...

అనంతరం... తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌... రెండో రోజు ఆట ముగిసేసరికి ఓపెనర్‌ డెన్లీ (4) వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లకు 23 పరుగులు చేసింది. ఇంగ్లీష్​ జట్టు ఇంకా 474 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం రోరి బర్న్స్‌ (15), కెప్టెన్‌ జో రూట్‌ (3) క్రీజులో ఉన్నారు.

ఇదీ చదవండి..కోహ్లీకి మరో ఝలక్​ ఇచ్చిన స్మిత్

Last Updated : Sep 29, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details