టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన మహిళా వికెట్ కీపర్ అలిసా హేలీ బ్రేక్ చేసింది. టీ20 ఫార్మాట్లో ఎక్కువ ఔట్లలో పాలుపంచుకున్న మహీ రికార్డును ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అధిగమించింది.
ధోనీ రికార్డు బ్రేక్ చేసిన ఆసీస్ మహిళా క్రికెటర్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ అలిసా హెలీ బ్రేక్ చేసింది. టీ20 ఫార్మాట్లో ధోనీ పేరు మీదున్న వికెట్ల రికార్డును తన పేరు మీద లిఖించుకుంది.
టీ20 ఫార్మాట్లో వికెట్ కీపర్‌గా హేలీ ఇప్పటివరకు 92 ఔట్లలో పాలుపంచుకుంది. టీమ్ఇండియా తరపున 98 టీ20లకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ 91 వికెట్లతో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరఫున 114 మ్యాచ్‌లు ఆడి 92 ఔట్లతో ఈ రికార్డును బ్రేక్ చేసింది హేలీ. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ పూర్తవ్వగానే.. అదే జట్టుపై వన్డే సిరీస్‌లోనూ హేలీ పాల్గొననుంది.
ధోనీ.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇతడు సారథ్యం వహిస్తోన్న సీఎస్కే తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.