పాకిస్థాన్‌కు చెందిన అంపైర్ అలీమ్ దార్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధికంగా 129వ మ్యాచ్‌కు అంపైరింగ్ చేయనున్నాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య గురువారం జరగనున్న తొలి టెస్టుతో ఈ ఘనత సాధించనున్నాడు. దీంతో స్టీవ్ బక్నోర్(128) పేరిట ఉన్న రికార్డును అధిగమించనున్నాడు అలీమ్.
2003లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో తొలిసారి టెస్టుల్లో అంపైర్‌గా అరంగేట్రం చేశాడు అలీమ్
"నా అంపైరింగ్ కెరీర్లో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితంలో ఇదో మైలురాయి. గుర్జన్‌వాలాలో నా ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభిమైనప్పటినుంచి ఇప్పటివరకు కొన్ని వేల మైళ్లు ప్రయాణించాను. ఈ ప్రయాణంలో ఎన్నో మరపురాని మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాను"